హుస్నాబాద్ కోర్టును తరలించవద్దు-తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ కోర్టును తరలించవద్దు-తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్, జూలై 6 (టీజీ24): హుస్నాబాద్ పట్టణంలోని కోర్టును ఇతర ప్రాంతానికి తరలించకుండా, ప్రస్తుతం ఉన్న ప్రాంతంలోనే నూతన కోర్టు భవనాన్ని నిర్మించాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి తగరపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. కోర్టును పట్టణానికి దూరంగా తరలిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కోర్టు సేవలు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అనిల్, శ్రీకాంత్, రమేష్, సాయి, సతీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.