
తెలంగాణ భూ రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా కందికట్ల రాజయ్య నియామకం
రాయపర్తి, జూలై 6 (టీజీ24): తెలంగాణ భూ రక్షణ సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కందికట్ల రాజయ్య నియమితులయ్యారు. నియామక పత్రాన్ని బుగ్గ మైసయ్య అందజేశారు. అసైన్డ్ భూముల సాగుదారులకు యాజమాన్య హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వంతో పోరాడి, జిల్లాలోని సాగుదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కందికట్ల రాజయ్య తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళి
నారాయణపేట్, జూలై 6 (టీజీ24): స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయ సాధనకు జీవితాన్ని అంకితం చేసిన బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. అణగారిన వర్గాల హక్కులు, సమానత్వం, విద్య, ఉపాధి అవకాశాల కోసం ఆయన నిరంతరం పోరాడారు. స్వాతంత్ర్యం అనంతరం రక్షణ, వ్యవసాయ, కార్మిక శాఖల మంత్రిగా, ఉప ప్రధాన మంత్రిగా విశిష్ట సేవలందించారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పలువురు పిలుపునిచ్చారు.

నేడు ఖమ్మలో పర్యటించనున్న DGP సివి ఆనంద్
ఖమ్మం, జూలై 07 (టీజీ 24): ఖమ్మం జిల్లాలో నేడు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించనున్నారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ప్రారంభించనున్న ఆయన, అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేయనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గిద్దె రాజేష్
హైద్రాబాద్, జూలై 07 (టీజీ 24): భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ హైదరాబాద్‌లోని నివాసంలో పద్మశ్రీ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను కలిసి పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా కావలి కొండయ్య యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక
మండల నూతన సర్పంచ్‌ల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడిగా కావలి కొండయ్య యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కొండయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, అందరినీ కలుపుకొని మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

కడియం శ్రీహరిపై సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 07 (టీజీ 24): ధర్మాదాయ శాఖ మంత్రికి సమాచారం ఇవ్వకుండా శాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించారని ఆరోపిస్తూ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాఖా మంత్రిని పక్కనపెట్టి దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపులు, మాస్టర్ ప్లాన్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం పరిపాలనా విధానాలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.

మరపురాని మహానేత వైయస్ఆర్
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 08 (టీజీ 24): కగూడెం మండల కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్‌తో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను నాయకులు గుర్తు చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడోసారి నియమితులైన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్‌తో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవులకు నియమితులైన నాయకులను, ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కన్నాయిగూడెం సర్పంచ్ కల్తీ విజయ్‌ను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

బల్కంపేట శ్రీ ఎల్లమ్మ ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, జూలై 08 (టీజీ 24): బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు, కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జూలై 20–22 వరకు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొని ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం
హైదరాబాద్, జూలై 16 (టీజీ 24): వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ పథకం మంచి ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి, గుడ్లు, పాలు తదితర ఆహార పదార్థాల నాణ్యతలో లోపాలు ఉంటే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్ చేస్తామని హెచ్చరించారు.

యాదాద్రి దేవస్థాన బోర్డు సభ్యుడు, మహిళా కమిషన్ సభ్యులను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి, జూలై 18. (టీజీ 24): ఇటీవల యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బోర్డు సభ్యుడిగా నియమితులైన డాక్టర్ లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన నునవాత్ రాధా భాయ్, చిట్యాల శ్వేత, శంకరమ్మలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. యాదాద్రి దేవస్థాన అభివృద్ధికి, మహిళల హక్కుల పరిరక్షణకు వారు సమర్థవంతంగా సేవలందిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సన్మానం అందుకున్న వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణలు ఎంతో దోహదం – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, జులై 20 (టీజీ 24): కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ మహిళా సంఘం (టీఎంఎస్ ఎన్జీవో) ఆధ్వర్యంలో నిర్వహించిన "గిఫ్టీ ఏ స్మైల్" కార్యక్రమంలో 500 మంది మహిళలకు నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహిళల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణలు ఎంతో దోహదపడతాయని అన్నారు. టీఎంఎస్ ఎన్జీవో ఫౌండర్ దొనికెన పద్మ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో మరింత మంది మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఘన స్వాగతం
వరంగల్, జూలై 21 (టీజీ 24): వరంగల్–హన్మకొండ జిల్లాల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఘన స్వాగతం పలికారు. హన్మకొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డితో కలిసి మడికొండలో మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు సమాచారం. మంత్రి పర్యటన విజయవంతం కావాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.
28 లో 1-12 చూపిస్తోంది