TG24TV
రచయిత
అక్రిడిటేషన్ ఉంటేనే జర్నలిస్టా? మీడియాపై వివక్ష ఎందుకు!
TG24TV
రచయిత
అక్రిడిటేషన్ ఉంటేనే జర్నలిస్టా? మీడియాపై వివక్ష ఎందుకు!

స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 22 (టీజీ 24): ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అక్రిడిటేషన్ కార్డుల అంశం వివాదానికి దారితీసింది. అక్రిడిటేషన్ ఉన్నవారే జర్నలిస్టులని, ఇతర ఛానళ్ల ప్రతినిధులు రావొద్దంటూ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, రంగారాయిగూడెం సర్పంచ్ శిరీష్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో డిజిటల్ మీడియా, ఇతర న్యూస్ ఛానళ్ల ప్రతినిధుల వృత్తిపరమైన గుర్తింపుపై చర్చ మొదలైంది. అక్రిడిటేషన్ అనేది ప్రభుత్వ అధికారిక గుర్తింపు మాత్రమేనని, అది ఒక్కటే జర్నలిస్టు వృత్తికి కొలమానం కాదని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రతి మీడియా ప్రతినిధికి సమాన గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించి స్పష్టత ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.