TG24TV
రచయిత
మంగంపల్లిలో ఆలయ ప్రవేశ వివక్ష ఆరోపణలు.. ఎమ్మార్పీఎస్ ఆగ్రహం
TG24TV
రచయిత
మంగంపల్లిలో ఆలయ ప్రవేశ వివక్ష ఆరోపణలు.. ఎమ్మార్పీఎస్ ఆగ్రహం

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశ వివక్ష ఘటనపై ఎమ్మార్పీఎస్, దళిత, గిరిజన, బహుజన సంఘాల నాయకులు బాధితుడు మాసాని సుధీర్కు సంఘీభావం తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, గ్రామంలో అందరికీ సమాన ఆలయ ప్రవేశ హక్కులు కల్పించాలని కోరారు. న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ,జిల్లా ప్రధాన కార్యదర్శి మీసాల నాగరాజు మాదిగ, దొడ్ల రాములు, కొమ్ము చెన్నయ్య, పానుగంటి సురేష్, కుమార్,స్వేరో రామకృష్ణ, ఎంఎస్ఎఫ్ వనపర్తి కో-ఇన్చార్జి మొలకలపల్లి పరశురాముడు మాదిగ, ఎమ్మార్పీఎస్ వనపర్తి మండల ఇన్చార్జి మచ్చ తిరుపతి మాదిగ,ఎమ్మార్పీఎస్ పెద్దమందడి మండల ఇన్చార్జి వెంకట్ రాములు మాదిగ, ఎంఎస్ఎఫ్ నాయకులు పుట్టపాగ అజయ్ మాదిగ, ఇతర ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.