T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలి: మహమ్మద్ అయూబ్

ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలి: మహమ్మద్ అయూబ్

ఆర్టీసీ ఎన్నికల్లో ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలి: మహమ్మద్ అయూబ్

వరంగల్, అక్టోబర్ 04 (టీజీ 24 ): ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తున్న TWU, SWF, INTUC ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ లోకల్ డిపోలో నిర్వహించిన ఆర్టీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి ఐక్య కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని మహమ్మద్ అయూబ్ తెలిపారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు...