T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం

ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం

ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం

హైదరాబాద్, జూలై 16 (టీజీ 24): వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ పథకం మంచి ఫలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి, గుడ్లు, పాలు తదితర ఆహార పదార్థాల నాణ్యతలో లోపాలు ఉంటే సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్ చేస్తామని హెచ్చరించారు.