T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

శక్తి సాయినగర్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

శక్తి సాయినగర్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

శక్తి సాయినగర్‌లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

నాచారం, నవంబర్ 08 (టీజీ 24): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శక్తి సాయినగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ 18వ డివిజన్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు ఎస్.వి. కృష్ణ కిట్టు ఆధ్వర్యంలో చిల్డ్రన్ హోప్ హోమ్ అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని అనాథాశ్రమంలోని చిన్నారులతో వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, ధనుంజయ, నరసింహ గౌడ్, ఫెరోజ్ ఖాన్, మనోహర్, కుమారస్వామి, సమ్మయ్య, కృష్ణమూర్తి గౌడ్, నరేష్ గౌడ్, రాజేష్ గౌడ్, విజయ రెడ్డి, రజిని రెడ్డి, లలిత, స్వాతి, రాంప్రసాద్ సింగ్, హరీష్, మదన్, నదీమ్, ఉదయ్, శ్రీను, సాయి కిరణ్, సంతోష్, సితేష్, ఫ్యూజ్, హలీం తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.