T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వికలాంగుల హామీలు అమలు చేయాలి – గిద్దె రాజేష్ డిమాండ్
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వికలాంగుల హామీలు అమలు చేయాలి – గిద్దె రాజేష్ డిమాండ్

హైదరాబాద్, జూలై 21 (టీజీ 24): ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేసిన ఆయన, వికలాంగుల పెన్షన్‌ను రూ.6,000లకు పెంచడం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు వంటి హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే, GHMC ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాస్, వీరస్వామి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.