T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వర్ధన్నపేటలో 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డుల పంపిణీ

వర్ధన్నపేటలో 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డుల పంపిణీ

వర్ధన్నపేటలో 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డుల పంపిణీ

వర్ధన్నపేట, సెప్టెంబర్ 24 ( టీజీ 24): నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) ఆధ్వర్యంలో వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాలకు చెందిన సుమారు 100 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డులను పంపిణీ చేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి కోళ్ల ఫామ్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు, యువ నాయకుడు ఆరూరి విశాల్ పాల్గొని లబ్ధిదారులకు ఎగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడిగుడ్డులో ప్రోటీన్‌తో పాటు పలు విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు లభిస్తాయని తెలిపారు. పిల్లల ఎదుగుదలకు, శరీర కండరాల అభివృద్ధికి కోడిగుడ్డు ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో NECC జనరల్ మేనేజర్ డాక్టర్ ఎజిల్ కుమార్, రాజీవ్, కోళ్ల రైతులు సుబ్రహ్మణ్యం, దిలీప్ రావు, స్థానిక నాయకులు, పౌల్ట్రీ రైతులు, లబ్ధిదారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.