T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పూర్వ విద్యార్థి పాఠశాలకు మైక్ సెట్ వితరణ

పూర్వ విద్యార్థి పాఠశాలకు మైక్ సెట్ వితరణ

పూర్వ విద్యార్థి పాఠశాలకు మైక్ సెట్ వితరణ

పూర్వ విద్యార్థి పాఠశాలకు మైక్ సెట్ వితరణ పూర్వపు విద్యార్థి పానుగంటి శాంతయ్య హెచ్డిఎఫ్సి గ్యాస్ డీలర్ కు సన్మానం చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం వనపర్తి ప్రతినిధి,14ఆగష్టు,(టిజి24): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి పానుగంటి శాంతయ్య మైక్ సెట్‌ను వితరణ చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మంజులత మాట్లాడుతూ.. పాఠశాల విద్యార్థుల కార్యక్రమాలకు ఉపయోగపడేలా మైక్ సెట్ అందించడం అభినందనీయమన్నారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ.. ఇదే పాఠశాలలో తాను కూడా చదువుకున్నానని, పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకరించడం సంతోషకరమన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ నాయక్, సీఆర్పీ తిరుపతి రెడ్డి పానుగంటి శాంతయ్య సేవలను అభినందించారు. తాను 1991లో ఇదే పాఠశాలలో ఏడో తరగతి పూర్తి చేశానని, పాఠశాలకు ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని దాత పానుగంటి శాంతయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.