TG24TV
రచయిత
ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర
TG24TV
రచయిత
ఎస్సారెస్పీ నీటి విడుదల కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర

రాయపర్తి, ఆగస్టు 17(టీజీ 24): మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మైలారం సబ్‌స్టేషన్ సమీపములో ఉన్న ఎస్సారెస్పీ కాలువ గుండా రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టి మడూర్ వరకు చేరుకొని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఎస్దీ విడుదల చేసేంతవరకు పోరాటాన్ని ఆపేది లేదంటూ నినాదాలు చేశారు. నితో ఇరువైపున వాహనాలు భారీగా ఆగిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా వద్దకు చేరుకొని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు, భారీగా ట్రాక్టర్లు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ నీటిని వెంటనే విడుదల చేసి రైతుల పంటలకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని వారు కోరారు. పాదయాత్రలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో మైలారం ప్రాంతంలో సందడి నెలకొంది.