T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ ఘన నివాళి

దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ ఘన నివాళి

దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డికి కేసీఆర్ ఘన నివాళి

నల్లబెల్లి, ఆగస్టు 09 (టీజీ 24): దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సేవకు ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బీఆర్‌ఎస్ పార్టీకి, ప్రజలకు తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో పెద్ది కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.