T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆనంద నిలయంగా కొండలయ్య క్షేత్రం!

ఆనంద నిలయంగా కొండలయ్య క్షేత్రం!

ఆనంద నిలయంగా కొండలయ్య క్షేత్రం!

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం జగత్‌పల్లి కొండలయ్య గుట్టపై శ్రావణ మాసం చివరి శనివారం భక్తుల సందడి నెలకొంది. వందలాది మంది భక్తులు తరలివచ్చి గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడగా, స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గుట్టంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. అనంతరం గట్టు నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటన్న యాదవ్, మాజీ సర్పంచులు మోహన్ కుమార్ యాదవ్, నిరంజన్ గౌడ్, నారాయణ యాదవ్, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.