T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆర్టీఐ సమాచారం ఇవ్వకపోవడంతో ఎంఈవోకు రూ.5 వేల జరిమానా

ఆర్టీఐ సమాచారం ఇవ్వకపోవడంతో ఎంఈవోకు రూ.5 వేల జరిమానా

ఆర్టీఐ సమాచారం ఇవ్వకపోవడంతో ఎంఈవోకు రూ.5 వేల జరిమానా

ఆర్టీఐ చట్టం కింద కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో ఇవ్వనందుకు హయత్‌నగర్ ఎంఈవో కర్నె శ్రీనివాస్‌కు రాష్ట్ర సమాచార కమిషన్ రూ.5 వేల జరిమానా విధించింది. ఈ మేరకు ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ ఆదేశాలు జారీ చేశారు. హయత్‌నగర్‌కు చెందిన అడ్వకేట్, ఆర్టీఐ కార్యకర్త మహేశ్‌బాబు చొల్లేటి కోరిన సమాచారాన్ని ఎంఈవో కార్యాలయం గడువులో అందించకపోవడంతో ఆయన సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణలో ఎంఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన కమిషనర్, చట్టాన్ని ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ రూ.5 వేల జరిమానా విధించారు.