T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ, అక్టోబర్ 04 (టీజీ 24):: ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం హనుమకొండ లోకల్ డిపోలో జరిగిన ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన TWU, SWF, INTUC ఐక్య కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత కోసం కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, కాంగ్రెస్ నాయకులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.