T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కష్టసుఖాల్లో ప్రజలకు అండగా ఎమ్మెల్యే మేఘారెడ్డి

కష్టసుఖాల్లో ప్రజలకు అండగా ఎమ్మెల్యే మేఘారెడ్డి

కష్టసుఖాల్లో ప్రజలకు అండగా ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి ప్రతినిధి,15అక్టోబర్,(టిజి24) వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ నాయకుడు రఘుపతిరావు తల్లి మాధరం బుచ్చమ్మ దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామానికి చెందిన ఆంజనేయులురావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎత్తం నరసింహ, బాబురావు కుటుంబాల్లో జరిగిన మరణాల నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి కష్టసుఖాల్లో అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

TG24TV TELANGANAtelagnanatelangana