T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చిన్న వర్షానికే చిత్తడిగా మారిన నల్ల చెరువు బస్‌స్టాండ్! బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల అవస్థలు.. పట్టించుకోని ఆర్టీసీ అధికారులు బస్సులు ఆగే చోటే నీటి గుంటలు.. అడుగడుగునా బురదమయం

నల్ల చెరువు, నవంబర్ 27 (టీజీ 24): చిన్నపాటి వర్షానికే నల్ల చెరువు బస్‌స్టాండ్ చిత్తడిగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు ఎక్కేందుకు వెళ్లే ప్రదేశంలోనే నీటి గుంటలు, బురద మడుగులు ఏర్పడటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు బస్సులు ఎక్కే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులు బురదలో నడవలేక, నీటి గుంటలను దాటలేక నానా తంటాలు పడుతున్నారు. బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బస్‌స్టాండ్‌లో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు ఆర్టీసీ అధికారులకు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు స్పందించి బస్‌స్టాండ్‌లో నిలిచిన నీటిని తొలగించి, బురద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.