T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఉద్యమకారుల గుర్తింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి: టీయుడబ్ల్యూజే
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఉద్యమకారుల గుర్తింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి: టీయుడబ్ల్యూజే

హైదరాబాద్, జూలై 21 (టీజీ 24): తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి తగిన గౌరవం, గుర్తింపు కల్పించాలని టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ కోరారు. ట్యాంక్‌బండ్‌లో నిర్వహించిన ఉద్యమ గుర్తింపు కమిటీ సంప్రదింపుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో జర్నలిస్టులు వార్తల ప్రచారంతో పాటు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొని, లాఠీచార్జీలు, తప్పుడు కేసులు, వేధింపులు, ఉద్యోగ నష్టాలను కూడా ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యమంలో సేవలందించిన జర్నలిస్టులకు ఉద్యమకారుల గుర్తింపు కల్పించాలని కోరుతూ ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని కమిటీకి టీయుడబ్ల్యూజే వినతిపత్రం అందజేసింది.