TG24TV
రచయిత
వెంకట సాయి నగర్ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమం 403 మంది చిన్నారులకు పోలియో చుక్కలు
TG24TV
రచయిత
వెంకట సాయి నగర్ కాలనీలో పల్స్ పోలియో కార్యక్రమం 403 మంది చిన్నారులకు పోలియో చుక్కలు

రామంతాపూర్ భగాయత్, నవంబర్ 22 (టీజీ 24): రామంతాపూర్ భగాయత్లోని వెంకట సాయి నగర్ కాలనీలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదేళ్లలోపు 403 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, పోలియో వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాలనీవాసులు స్పందించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను పోలియో కేంద్రానికి తీసుకువచ్చి చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ బి. రామదేవి చిన్నారులకు పోలియో చుక్కలు వేయగా, ఆశా వర్కర్ రాధిక కార్యక్రమ నిర్వహణలో సహకరించారు. విద్యార్థులు సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ రామదేవి మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు.