T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవాన్ ఊరేగింపు

త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవాన్ ఊరేగింపు

త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవాన్ ఊరేగింపు

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయిపల్లి గ్రామంలో శ్రీకృష్ణ భగవానుడి ప్రతిమ ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఇందూ జ్ఞాన వేదిక, త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి, వీరాయిపల్లి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ పురవీధుల్లో శ్రీకృష్ణ ప్రతిమను ఊరేగించారు. భగవద్గీత శ్లోకాల ఉచ్చారణలతో భక్తులు భక్తి పారవశ్యంలో పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, సర్పంచ్ చిట్యాల వెంకటయ్య, జనార్దన్ రెడ్డి, పంచాయతీ సెక్యూరిటీ వెంకటేష్, కురుమయ్యతో పాటు పలువురు నిర్వాహకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

telagnana