T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన తెలంగాణ బీజేపీ బృందం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన తెలంగాణ బీజేపీ బృందం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసిన తెలంగాణ బీజేపీ బృందం

వర్దన్నపేట, ఆగస్టు 10 (టీజీ 24): వరంగల్–మామునూరు విమానాశ్రయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ప్రొఫెసర్ ఆజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. వన్నాల వెంకటరమణలతో కలిసి ఢిల్లీలో మంత్రిని కలసి అధికారిక లేఖ అందజేశారు. మామునూరు విమానాశ్రయ శంకుస్థాపన/ప్రారంభోత్సవానికి వరంగల్ రావాలని మంత్రిని ఆహ్వానించారు. విమానాశ్రయం కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కొండేటి శ్రీధర్ కోరారు. అదిలాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని కూడా త్వరగా చేపట్టాలని ఎంపీ గోడెం నగేష్ విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థనలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం బీజేపీ బృందం మంత్రిని సత్కరించింది.