T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల సస్పెన్షన్‌ వేటు సరైనది కాదు

తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల సస్పెన్షన్‌ వేటు సరైనది కాదు

తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల సస్పెన్షన్‌ వేటు సరైనది కాదు

వనపర్తి ప్రతినిధి,11 సెప్టెంబర్,(టిజి24): తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిల సస్పెన్షన్‌పై పెద్దమందడి మండల బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని విమర్శించారు. సభా గౌరవం, పదవుల ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అయితే అధికార, ప్రతిపక్షాలకు నిబంధనలు సమానంగా వర్తించాలన్నారు. అధికార పక్ష నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పుడు రాజకీయ విమర్శలుగా కొట్టిపారేసి, ప్రతిపక్ష ఎమ్మెల్సీలపై వెంటనే సస్పెన్షన్‌ విధించడం ఏ విధమైన ప్రజాస్వామ్య న్యాయమని ప్రశ్నించారు. నిబంధనలు అందరికీ సమానంగా వర్తించాలని కోరారు.

ట్యాగ్‌లు

brs party