T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తొర్రూరులో ఘనంగా TRTF సభ్యత్వ నమోదు కార్యక్రమం

తొర్రూరులో ఘనంగా TRTF సభ్యత్వ నమోదు కార్యక్రమం

తొర్రూరులో ఘనంగా TRTF సభ్యత్వ నమోదు కార్యక్రమం

తొర్రూరు, ఆగస్టు 17 (టీజీ 24): తొర్రూరు మండల కేంద్రంలోని ZPSS ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) సభ్యత్వ నమోదు కార్యక్రమం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య కిరణ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొని సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో TRTF మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ వట్నాల పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఉపాధ్యాయులకు సంబంధించిన హెల్త్ కార్డులు సమర్థవంతంగా పనిచేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న PRC, DAలను వెంటనే మంజూరు చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి TRTF నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి రాజు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి యడాల సారంగం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు