T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక పాలకుర్తి మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక పాలకుర్తి మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక పాలకుర్తి మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

పాలకుర్తి, అక్టోబర్ 06 (టీజీ 24): తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ ఆదేశాల మేరకు, రాష్ట్ర కన్వీనర్ శ్యామ్ కృష్ణ అనుమతితో జనగామ జిల్లా అడక్ కమిటీ సభ్యులు మూల ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక పాలకుర్తి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మల్లంపల్లి గ్రామ సర్పంచ్ పోశాల వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక పాలకుర్తి మండల అధ్యక్షుడిగా చెన్నూరు గ్రామానికి చెందిన ఎండి. నాసర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్షులుగా కుమార్, గన్ను కృష్ణమూర్తి, కోశాధికారిగా ఆర్. శ్రీనివాస్, మండల గౌరవ అధ్యక్షులుగా ఆరూరి సోమయ్య, దండయ్యలను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా ఎల్. రవి, మాటూరి యాకయ్య, పొన్నం యాకయ్యలను ఎంపిక చేశారు. సాంస్కృతిక విభాగం బాధ్యతలను కారుపోతుల సోమయ్య, ఎల్లయ్యలకు అప్పగించారు. ఈ సందర్భంగా తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమకారులు పాల్గొని నూతనంగా ఎన్నికైన మండల కమిటీకి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.