TG24TV
రచయిత
అల్వాల గ్రామంలో ముమ్మరంగా ఇందిరమ్మ గృహాల వెరిఫికేషన్
TG24TV
రచయిత
అల్వాల గ్రామంలో ముమ్మరంగా ఇందిరమ్మ గృహాల వెరిఫికేషన్

పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో గురువారం ఇందిరమ్మ గృహాల రెండవ విడత వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహాలకు అర్హులైన లబ్ధిదారుల ఇంటి స్థలాలను పరిశీలించి,స్థలాల వివరాలను సర్వే చేశారు.ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి అర్హులైన లబ్ధిదారులకు సంబంధించిన ఇంటి స్థలాల పరిస్థితి, అందుబాటులో ఉన్న స్థలం తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గృహ సదుపాయం అందేలా వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామంలో ఇందిరమ్మ గృహాల పథకం అమలుతో పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో సర్పంచ్ రాజా మహేందర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,బాల్ రెడ్డి,ఆశన్న యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.