T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

వీధిలైట్ల ఏర్పాటులో వివక్ష ఎందుకు?

వీధిలైట్ల ఏర్పాటులో వివక్ష ఎందుకు?

వీధిలైట్ల ఏర్పాటులో వివక్ష ఎందుకు?

ఏటూరునాగారం, సెప్టెంబర్ 8:(టీజీ 24) : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వీధిలైట్ల ఏర్పాటు విషయంలో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. చిన్నబోయినపల్లి, హనుమాన్‌నగర్ గ్రామాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేసినప్పటికీ.. అదే గ్రామపంచాయతీ పరిధిలోని పెద్ద వెంకటాపూర్, రాయిబందం గ్రామాల్లో మాత్రం ఒక్క వీధిలైట్ కూడా ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకే గ్రామపంచాయతీ పరిధిలో కొన్ని గ్రామాల్లో మాత్రమే వీధిలైట్లు ఏర్పాటు చేసి, మిగతా గ్రామాలను పట్టించుకోకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాత్రి వేళల్లో వీధిలైట్లు లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెద్ద వెంకటాపూర్, రాయిబందం గ్రామాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేసి, అన్ని గ్రామాలకు సమానంగా అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.