T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వర్ధన్నపేట ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వెంటనే ప్రారంభించాలి-MLA KR నాగరాజు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వర్ధన్నపేట ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వెంటనే ప్రారంభించాలి-MLA KR నాగరాజు

వర్ధన్నపేట, సెప్టెంబర్ 18 (టీజీ 24): వర్దన్నపేట నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. రూ.200 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని సభ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పథకాన్ని అభినందిస్తూ, గర్ల్స్ హాస్టళ్లలో భవనాలు, కాంపౌండ్ వాల్స్, ఇతర మౌలిక వసతులతో పాటు రాత్రివేళల్లోనూ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు.