
దేవరుప్పులలో ఘనంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు
దేవరుప్పుల: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు దేవరుప్పుల మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన సతీమణి శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ప్రజలు, పార్టీ కార్యకర్తల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొని ఎర్రబెల్లి దయాకర్ రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజాసేవ మరెన్నో సంవత్సరాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

చెన్నూరులో దయన్న బర్త్‌డే వేడుకలు.. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
పాలకుర్తి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదినం సందర్భంగా చెన్నూరు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు పాల్గొని విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తన జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా కష్టపడి ముందుకు సాగాలని సూచించారు. దయన్న జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన ICON GRAPHICS ప్రతినిధులు పూస్కూరి సోమేశ్వర్ రావు, సురేష్ రావులను అభినందించారు. వారు మాట్లాడుతూ, "విద్యార్థులే దేశ భవిష్యత్తు.. వారి విద్యాభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది" అని తెలిపారు.