పెద్దవంగరలో ఎర్రబెల్లి దయన్న బర్త్‌డే వేడుకలు

పెద్దవంగరలో ఎర్రబెల్లి దయన్న బర్త్‌డే వేడుకలు

పెద్దవంగర: రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదిన వేడుకలను పెద్దవంగర మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్ల పంపిణీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ, కస్తూర్బా పాఠశాలలో పండ్ల పంపిణీతో పాటు తొర్రూరు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఈదురు అయిలయ్య మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత ఎర్రబెల్లి దయాకర్ రావుదేనని అన్నారు. మండల ఏర్పాటు నుంచి రహదారులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కమ్యూనిటీ హాల్స్, సాగునీటి సౌకర్యాలు, ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దయన్న 70వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు

దయన్న 70వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు

తొర్రూరు: రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదినం సందర్భంగా తొర్రూరు పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయన్న జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారిని అభినందిస్తూ, వారి సేవ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని ఉషా దయాకర్ రావు పేర్కొన్నారు.