T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
దయన్న 70వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
దయన్న 70వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు

తొర్రూరు: రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదినం సందర్భంగా తొర్రూరు పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయన్న జన్మదినం పురస్కరించుకుని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారిని అభినందిస్తూ, వారి సేవ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని ఉషా దయాకర్ రావు పేర్కొన్నారు.
ట్యాగ్‌లు
errabelli dayakar raobirth day celebrations