T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన 1999-2000 పదో తరగతి పూర్వ విద్యార్థులు

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన 1999-2000 పదో తరగతి పూర్వ విద్యార్థులు

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన 1999-2000 పదో తరగతి పూర్వ విద్యార్థులు

పర్వతగిరి, జూలై 16 (టీజీ 24): రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విశ్వ జెనిత్ స్కూల్ కరెస్పాండెంట్ ఎర్రబెల్లి హరి కుటుంబానికి ఆయన 1999-2000 పదో తరగతి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. హరి దశదిన కర్మ సందర్భంగా పెద్ద సంఖ్యలో హాజరైన స్నేహితులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు. అనంతరం హరి కుమార్తె ఆధ్యశ్రీ భవిష్యత్తు కోసం రూ.1,00,000 సేకరించి పోస్టల్ అకౌంట్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, డిపాజిట్ పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపదలో స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచిన పూర్వ విద్యార్థుల సేవాభావాన్ని స్థానికులు, గ్రామస్తులు అభినందించారు.