
పెసరు రమేష్‌కు ఘన సన్మానం
పెసరు రమేష్‌కు ఘన సన్మానం -ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పెసరు రమేష్. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన పెసరు.రమేష్‌కు మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్స్‌లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, అభిమానులు పాల్గొని శాలువా కప్పి,పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పెసరు.రమేష్ మాట్లాడుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు కార్యకర్తలకు అండగా నిలిచి, ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

ఘనంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదిన వేడుకలు
రాయపర్తి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదిన వేడుకలను SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాయపర్తి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి భారీ బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా, మండల, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజలకు మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షించారు.

హాసన్‌పర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు
హాసన్‌పర్తి: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను హాసన్‌పర్తి మండలంలోని 66వ డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. 66వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజలకు మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాసన్‌పర్తి మండల అధ్యక్షుడు బండి రజని కుమార్, కందుకూరి చంద్రమోహన్, నద్దునూరి నాగరాజు, సీతంపేట గ్రామ సర్పంచ్ భగవాన్ రెడ్డి, చింత లక్ష్మణ్ యాదవ్, డివిజన్ యూత్ అధ్యక్షుడు వల్లాల శ్రీకాంత్ గౌడ్, జన్ను కిషన్, బొక్క కుమార్, ఆరెపల్లి శ్రావణ్, మేకల రాజేందర్, చాటెల్ల వేణుగోపాల్, గోపి, శరత్, వేల్పుల సాయి యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

ఘనంగా ఎర్రబెల్లి దయన్న 70వ జన్మదిన వేడుకలు.. ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్ల పంపిణీ
వర్ధన్నపేట: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదిన వేడుకలను వర్ధన్నపేట మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎర్రబెల్లి దయన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వెళ్లి రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజాసేవ మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

పర్వతగిరిలో ఎర్రబెల్లి దయాకర్ రావు బర్త్‌డే వేడుకలు.. కేక్ కట్ చేసిన అరూరి రమేష్
పర్వతగిరి: రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు 70వ జన్మదిన వేడుకలను పర్వతగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఎర్రబెల్లి దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పర్వతగిరి ముద్దుబిడ్డగా ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
-2026-07-06-08-07-27.webp)
విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన నారాయణగిరి సర్పంచ్ పుట్ట రేణుక
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పుట్ట.రేణుక ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి,వారితో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ ఆహార నాణ్యతపై ఆరా తీశారు.నారాయణగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించిన గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక,విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,వంట సిబ్బంది పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాసరెడ్డి
రాయపర్తి, జూలై 6 (టీజీ24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కత్తి కుమారస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్‌ను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, లేతకుల రంగా రెడ్డి, గట్టు నర్సింహాచార్యులు, కత్తి రవీందర్, కేమిడి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

రామస్వామి కుటుంబానికి 50 కిలోల బియ్యం నూనె క్యాన్ అందించిన SRR ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి, జూలై 6 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం శివరామాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు పులిగుజ్జ రామస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. రాష్ట్ర మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి SRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్‌ను కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, లేతకుల రంగా రెడ్డి, తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, చందు రామ్, బాధ రవి, మాజీ సర్పంచ్ చెడుపాక కుమారస్వామి, చెడుపాక సుతారి యాకయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి -ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట, జూలై 6 (టీజీ 24): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) కిట్లు పంపిణీ చేసి, పార్టీ ఇన్‌చార్జిలు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలతో సమావేశం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హుల పేర్లు నమోదు చేయడంతో పాటు మార్పులు, చేర్పులు సక్రమంగా జరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి రాజేందర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సోషల్ వెల్ఫేర్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు
వర్ధన్నపేట, జూలై 6 (టీజీ 24): వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మడికొండలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనం, వైద్య సదుపాయాలు, వసతులు, విద్యాబోధనపై ఆరా తీసి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఉపాధ్యాయులు వారి ప్రతిభను వెలికితీసేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించిన డాక్టర్ వన్నాల వెంకటరమణ
వరంగల్, జూలై 6 (టీజీ 24): ఆర్థిక ఇబ్బందులతో పరీక్ష ఫీజు చెల్లించలేని ఇంజినీరింగ్ విద్యార్థిని మేకల సంజనకు VAK ఫౌండేషన్ ద్వారా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, VAK ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వన్నాల వెంకట రమణ అందజేశారు. ఉర్సు-కరిమాబాద్‌కు చెందిన మేకల లింగమూర్తి అభ్యర్థన మేరకు ఈ సహాయం చేసినట్లు తెలిపారు. గత 16 ఏళ్లుగా VAK ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచిత బియ్యం, వైద్య శిబిరాలు, విద్యా సహాయం, వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అపురూప రజనీష్ నేత, సముద్రాల పరమేశ్వర్, రత్నం సతీష్ షా తదితరులు పాల్గొన్నారు.

మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాష్
హైదరాబాద్, జూలై 6 (టీజీ 24): వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన చైర్మన్‌గా ఇటీవల నియమితులైన మీసాల ప్రకాష్ సోమవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆయనకు అభినందనలు తెలియజేసి, గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విజ్ఞాన కేంద్రాలుగా గ్రంథాలయాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.
65 లో 1-12 చూపిస్తోంది