T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాయపర్తి, ఆగస్టు 15 (టీజీ 24): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈదులకంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా అహింసను ఆయుధంగా మలిచి సాగించిన మహా పోరాటమే భారత స్వాతంత్ర్య సంగ్రామమని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని నవభారత నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.