T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జగన్నాధపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జగన్నాధపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాయపర్తి, ఆగస్టు 15 (టీజీ 24): మండలంలోని జగన్నాథ పల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో స్థానిక సర్పంచ్ బద్దం సుగుణమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ బద్దం సుగుణమ్మ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా జగన్నాధపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గూడెల్లి శ్రీను, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.