T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

గ్రామ సమస్యలపై గ్రామసభ నిర్వహించాలని వినతి

గ్రామ సమస్యలపై గ్రామసభ నిర్వహించాలని వినతి

గ్రామ సమస్యలపై గ్రామసభ నిర్వహించాలని వినతి

కురవి, సెప్టెంబర్ 23 (టీజీ 24): కురవి మండలం లోని గుండ్రాతిమడుగు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు గ్రామసభ నిర్వహించాలని కోరుతూ గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా గ్రామసభ ఏర్పాటు చేయాలని వారు కోరారు. గ్రామ ప్రజల సమస్యలను గ్రామసభ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కార మార్గాలు చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు వెలిమిశెట్టి రామకృష్ణ, మాజీ సర్పంచ్ జంగిలి హరిప్రసాద్, గ్రామ పెద్దలు బండి దేవేందర్ రెడ్డి, బండి అనిల్ రెడ్డి, పత్తి వెంకన్న, బండ రామకృష్ణ, జలగం మల్లేష్, మారగాని శ్రీను, జలగం ప్రవీణ్, అబ్బగాని నాగేష్, జక్క లింగన్న, పెద్దోజు బ్రహ్మచారి, మందుల శ్రీను, ఎల్లంకి మల్లేష్, పోతుల ఈరన్న, గుడి శీను తదితరులు పాల్గొన్నారు.