TG24TV
రచయిత
ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి జయంతి వేడుకలు
TG24TV
రచయిత
ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి జయంతి వేడుకలు

రాయపర్తి, ఆగస్టు 06 (టీజీ 24): రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం తరతరాలకు స్ఫూర్తిదాయకమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు లేతకుల రంగా రెడ్డి, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, ఐత రామ్ చందర్, చిన్నల ఉప్పలయ్య, చందు రామ్, పెద్దగోళ్ళ రాజు, సంకినేని ఎల్లస్వామి, చిర్ర శ్రీనివాస్, ఐత రవి, సకినాల రామన్న, తెరల సదానందం, చిర్ర విష్ణు, రమాకాంత్, మధు తదితరులు పాల్గొన్నారు.