T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు..
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు..

వర్ధన్నపేట, జూలై 27 (టీజీ. 24): వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. బాలిక తల్లి తెలిపిన వివరాల ప్రకారం, నిన్న పాఠశాలకు సెలవు కావడంతో బాలికను మాయమాటలు చెప్పి తాటికాయల భాస్కర్ (50) అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. అనంతరం బాలిక చెప్పిన వివరాల ఆధారంగా వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు భాస్కర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పాటు, కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారికంగా ధృవీకరణ రాలేదు.