T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పులి గణేష్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
పులి గణేష్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి

పాలకుర్తి, జూలై 21 (టీజీ 24): రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ కార్యదర్శి పులి గణేష్ గౌడ్ మాతృమూర్తి పులి రుక్కమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత రుక్కమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ అనుముల మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు భైరి భార్గవ్, పసులాది ప్రశాంత్, పులి కృష్ణ, పులి సోమయ్య, అన్నమయ్య, శ్రీను, పులి ఆంజనేయులు, బెలిదే భద్రయ్య, గజ్జి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.