T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

పర్వతగిరి, జూలై 30 (టీజీ 24): మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏడి మైనింగ్ స్పెషల్ ఆఫీసర్ రవిశంకర్, డీపీఓ కల్పన, ఎంపీడీఓ, ఎమ్మార్వో, ఎంపీఓ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.