TG24TV
రచయిత
ఓరుగల్లు వసంతోత్సవంలో పాల్గొన్న భారతి కూరాకుల
TG24TV
రచయిత
ఓరుగల్లు వసంతోత్సవంలో పాల్గొన్న భారతి కూరాకుల

వరంగల్ కలెక్టరేట్, ఆగస్టు 18 (టీజీ 24): వరంగల్ నగరంలో కాకతీయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల (ఎన్‌ఆర్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరుగల్లు వసంతోత్సవం కార్యక్రమంలో రిటైర్డ్ సహాయ కార్మిక కమిషనర్, అంతర్జాతీయ క్రీడా విజేత, వుమెన్ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షురాలు భారతి కూరాకుల పాల్గొన్నారు. గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించడం, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, వనాల అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఎన్‌జీవోలు, పోలీస్ శాఖ అధికారులు, కాకతీయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు, నగర ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.