TG24TV
రచయిత
పెదగాని సోమక్క పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన టీపీసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి
TG24TV
రచయిత
పెదగాని సోమక్క పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన టీపీసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి

రాయపర్తి, ఆగస్టు 06 (టీజీ 24): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తొర్రూరు పట్టణ మాజీ సర్పంచ్ పెదగాని సోమన్న తల్లి పెదగాని సోమక్క అనారోగ్యంతో మృతి చెందింది. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి సోమక్క నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కౌన్సిలర్ ముదసాని సురేష్, మహిళా నాయకురాలు పంజా కల్పనా, మండల పార్టీ నాయకుడు పాల శ్రీను, తొర్రూరు మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొని మృతురాలికి నివాళులర్పించారు.