T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నిరుపేద విద్యార్థినికి రూ.20 వేల ఆర్థిక సహాయం అందించిన టీపీసీసీ మాజి కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి

రాయపర్తి, జూలై 11 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికేడు గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని ప్రీతిక ఉన్నత విద్య చదవడానికి ఇబ్బంది పడుతున్నది. పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు బిల్లా శివాని రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీపీసీసీ మాజీ కార్యదర్శి బిల్లా సుధీర్ రెడ్డి - ఉషమ్మ దంపతులు శనివారం ప్రీతికకు రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తీగల సాయిలు గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.