T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హాసన్‌పర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు

హాసన్‌పర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు

హాసన్‌పర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలు

హాసన్‌పర్తి: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదిన వేడుకలను హాసన్‌పర్తి మండలంలోని 66వ డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. 66వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజలకు మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాసన్‌పర్తి మండల అధ్యక్షుడు బండి రజని కుమార్, కందుకూరి చంద్రమోహన్, నద్దునూరి నాగరాజు, సీతంపేట గ్రామ సర్పంచ్ భగవాన్ రెడ్డి, చింత లక్ష్మణ్ యాదవ్, డివిజన్ యూత్ అధ్యక్షుడు వల్లాల శ్రీకాంత్ గౌడ్, జన్ను కిషన్, బొక్క కుమార్, ఆరెపల్లి శ్రావణ్, మేకల రాజేందర్, చాటెల్ల వేణుగోపాల్, గోపి, శరత్, వేల్పుల సాయి యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

errabelli dayakar raobirth day celebrationswarangal brs partybrs party