TG24TV
రచయిత
రేషన్ డీలర్ పరకాల నాగరాజు మాతృమూర్తి మృతి పార్థివదేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు
TG24TV
రచయిత
రేషన్ డీలర్ పరకాల నాగరాజు మాతృమూర్తి మృతి పార్థివదేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు

రాయపర్తి, ఆగస్టు 31 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన రేషన్ డీలర్ పరకాల నాగరాజు తల్లి పరకాల కొమురమ్మ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు కొమురమ్మ మృతదేహానికి రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాయపర్తి మాజీ సర్పంచ్ గారే నర్సయ్య, మాజీ ఎంపీటీసీ ఐత రామ్ చందర్ తదితరులు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తూ, కొమురమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు చందు రామ్, చందు మల్లేష్, చిన్నల ఉప్పలయ్య, చందు సతీష్, పెద్దగోని జీవన్, మైస వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.