T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బిట్టు పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు

బిట్టు పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు

బిట్టు పార్ధీవ దేహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ నాయకులు

రాయపర్తి, ఆగస్టు 20 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గబ్బేట కొమురయ్య మనుమడు బిట్టు (3) అనారోగ్యంతో మృతి చెందాడు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు మైలారం గ్రామానికి చేరుకుని బిట్టు పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, చిన్నారి మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, వార్డు నెంబర్ గాడిపెల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.