T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భూక్య వసరాం మృతికి బిఆర్ఎస్ నాయకుల నివాళులు
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భూక్య వసరాం మృతికి బిఆర్ఎస్ నాయకుల నివాళులు

రాయపర్తి, ఆగస్టు 12 (టీజీ 24): వరంగల్ జిల్లా రాయపర్తి మండలం శివరామాపురం గ్రామ పరిధిలోని సుభాష్ తండాలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భూక్య సర్వన్ తండ్రి భూక్య వసరాం అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భూక్య వసరాం పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని, కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపర్తి మండల మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మండల పార్టీ నాయకులు ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, నాగపూరి సోమయ్య, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు భూక్య జగన్ తదితరులు పాల్గొన్నారు.