TG24TV
రచయిత
ఘనంగా కుంభం శివపటేల్ జన్మ దిన వేడుకలు
TG24TV
రచయిత
ఘనంగా కుంభం శివపటేల్ జన్మ దిన వేడుకలు

వర్ధన్నపేట, జులై 31 (టీజీ 24): 14వ డివిజన్ మాజీ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం శివపటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తూర్పాటి సులోచన–సారయ్య , జన్ను శీభారాణి–అనిల్ కుమార్ (చిట్టి అన్న), వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చిలువేరు శ్రీను, గ్రామ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విచ్చేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ కుంభం శివపటేల్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి ప్రేమ, ఆదరణ, ఆశీస్సులు తనకు మరింత బాధ్యతను గుర్తు చేస్తూ, ప్రజాసేవలో మరింత అంకితభావంతో ముందుకు సాగేందుకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.