T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చొప్పరి సోమయ్యకు ఘన సత్కారం
T
TG24TV
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చొప్పరి సోమయ్యకు ఘన సత్కారం

వర్ధన్నపేట, జూలై 21 (టీజీ 24): లయన్స్ క్లబ్ జిల్లా 320F కోశాధికారి చొప్పరి సోమయ్య ఇటీవల 108వ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా చైనా, హాంకాంగ్, మకావో నగరాలను సందర్శించి స్వదేశానికి తిరిగి రావడంతో వర్ధన్నపేటలో ఘనంగా సత్కరించారు. మున్సిపల్ కౌన్సిలర్ సిలివేరు కుమారస్వామి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సోమయ్యకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.