T

TG24TV

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అర్వపల్లి లో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

అర్వపల్లి లో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

అర్వపల్లి లో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

సూర్యాపేట, జూలై 08 (టీజీ 24): సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంపై ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురు నాయకులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఘర్షణలో కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.