సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం బదిలీ

సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయిరాం బదిలీ

సూర్యాపేట, జూలై 06 (తేజీ 24) సూర్యాపేట ఎస్సై గా ఎంతో ప్రతిభ కనబరిచి, ట్రాఫిక్ నియంత్రణలో అహర్నిశలు శ్రమించి ప్రజల మన్ననలు పొందిన సాయిరాంను సీసీఎస్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో యాదవేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు.

మా ఎమ్మెల్యే నుండి  కాంగ్రెస్ పార్టీని కాపాడండి" అంటూ కాంగ్రెస్ నాయకుల ధర్నా

మా ఎమ్మెల్యే నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడండి" అంటూ కాంగ్రెస్ నాయకుల ధర్నా

తుంగతుర్తి, జూలై 06 (టీజీ 24): గతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు అర్వపల్లి చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, "మా ఎమ్మెల్యే నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడండి" అంటూ నినాదాలు చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీలు అవసరం లేదని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్యే విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని పలువురు కాంగ్రెస్ వాదులు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్వపల్లి లో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

అర్వపల్లి లో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ

సూర్యాపేట, జూలై 08 (టీజీ 24): సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంపై ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన పలువురు నాయకులు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఘర్షణలో కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.